bihar: బీహార్‌ సీఎం అభ్యర్థిని నేనే!: పేపర్లలో ఫుల్‌ పేజీ ప్రకటనలిచ్చిన బీహార్‌ యువతి ప్రియ

i am cm candidate bihar girl
  • కొన్ని నెలల్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 
  • లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌‌లో చదువుతోన్న ప్రియ
  • యునైటెడ్ జనతాదళ్ మాజీ ఎమ్మెల్సీ వినోద్ చౌదరి కూతురు ప్రియ
  • బీహార్‌లో మార్పు అవసరమని పిలుపు
కొన్ని నెలల్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల సీఎం అభ్యర్థిని తానేనంటూ ప్రియా చౌదరీ అనే ఆ రాష్ట్ర యువతి హిందీ, ఇంగ్లిష్ పేపర్లలో ఫుల్ పేజీ ప్రకటనలిచ్చి తీవ్ర చర్చనీయాశంగా మారింది. ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌‌లో చదువుతోంది. ఆమె యునైటెడ్ జనతాదళ్ మాజీ ఎమ్మెల్సీ వినోద్ చౌదరి కూతురు.

బీహార్‌లో మార్పు అవసరమని, చెత్త రాజకీయాలను తిరస్కరించాలని ఆమె ట్విట్టర్‌లోనూ పేర్కొంది. 2020లో ఎగిరేందుకు, పరిగెత్తేందుకు ప్లూరల్స్‌తో చేతులు కలపండంటూ పిలుపునిచ్చింది. బీహార్‌లో మార్పు సాధ్యమవుతుందని తెలిపింది. రాజకీయాల్లో ఎవరు, ఎప్పుడు, ఎలా ప్రవేశిస్తారో ఎవరికీ తెలియదంటూ ఆమె పేర్కొంది. ఆమె తన రాజకీయ రంగ ప్రవేశం గురించి కొన్ని రోజుల నుంచి వరుస ట్వీట్లు చేస్తోంది.

bihar
Twitter

More Telugu News