ప్రణయ్ హత్యకేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య
- ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో ఆత్మహత్య
- నిన్ననే ఓ గది అద్దెకు తీసుకున్న వైనం
- ప్రణయ్ హత్య కేసులో కీలక సూత్రధారి
నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారి అయిన మారుతీరావు.. ప్రణయ్ హత్యకేసుతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. తన కుమార్తె అమృత అదే ప్రాంతానికి చెందిన ప్రణయ్‌ను ప్రేమ వివాహం చేసుకోవడాన్ని చూసి తట్టుకోలేకపోయిన మారుతీరావు 2018లో ప్రణయ్‌ను హత్య చేయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో అరెస్ట్ అయిన మారుతీరావు ఇటీవలే బెయిలుపై విడుదలయ్యాడు.