ఒంటరి వృద్ధురాలిపై యువకుడి అత్యాచారం.. చిత్తూరు జిల్లాలో ఘటన
- భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న మహిళ
- ఆవును మేపుకుంటూ పొలానికి వెళ్లిన బాధితురాలు
- దాడిచేసి అత్యాచారం చేసిన నిందితుడు
ఆమెపై కన్నేసిన గ్రామానికి చెందిన వడ్డె చిన్న రెడ్డప్ప (35) పథకం ప్రకారం ఆమె వెనకే వెళ్లాడు. ఆ చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో గమనించి ఆమెపై దాడిచేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత కొంత సమయానికి తేరుకున్న బాధితురాలు ఇంటికి వెళ్లి ఇరుగుపొరుగు వారికి చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.