America: న్యూయార్క్‌లో కొత్తగా మరో 23 కరోనా కేసులు.. ఎమర్జెన్సీ ప్రకటన

Cuomo Declares state of Emergency in New York
  • ప్రావిన్స్‌లో పెరుగుతున్న కరోనా బాధితులు
  • 19కి చేరిన మృతుల సంఖ్య
  • పరిస్థితిని సమీక్షించిన గవర్నర్
కోవిడ్-19 ఇప్పుడు అమెరికాను వణికిస్తోంది. న్యూయార్క్‌లో కొత్తగా మరో 23 కరోనా నిర్దారిత కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ కయూమో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రావిన్స్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య గత కొన్ని రోజులుగా పెరుగుతున్నట్టు ఈ సందర్భంగా గవర్నర్ తెలిపారు. న్యూరోషెల్‌లో కొత్తగా 23 కేసులు నమోదు కాగా, వెస్ట్‌చెస్టర్‌లో కరోనా బాధితుల సంఖ్య 57కు పెరిగినట్టు పేర్కొన్నారు.  రాక్‌అవే, సార్టోగా కౌంటీలలో కూడా కొత్త కేసులు నమోదైనట్టు వివరించారు.

మరోవైపు, ఈ వైరస్ కారణంగా అమెరికాలో మృతి చెందిన వారి సంఖ్య 19కి చేరుకుంది. దీంతో పరిస్థితిని సమీక్షించిన గవర్నర్.. ఎమర్జెన్సీని ప్రకటించారు. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక ఆరోగ్య సంస్థలలో సమస్యలు ఎదురువుతున్నాయన్నారు. అత్యవసర పరిస్థితి విధిస్తే మరింత ఎక్కువమంది సిబ్బందిని నియమించుకోవడానికి వీలుటుందని చెప్పారు.
America
Corona Virus
Emergency
New York

More Telugu News