తమిళనాడులో తొలి కరోనా కేసు.... మస్కట్ నుంచి వచ్చి ఆసుపత్రిపాలైన వ్యక్తి
- మార్చి 5న ఆసుపత్రిలో చేరిన 45 ఏళ్ల వ్యక్తి
- కరోనా అనుమానంతో ఐసోలేషన్ వార్డుకు తరలించిన ఆసుపత్రి వర్గాలు
- పుణేలో శాంపిల్స్ పరీక్ష .. కరోనా పాజిటివ్ గా తేలిన వైనం
జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఆ వ్యక్తి మార్చి 5న నగరంలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. కరోనా అనుమానితుడిగా భావించి అతడిని ఆసుపత్రి వర్గాలు ఐసోలేషన్ వార్డుకు తరలించాయి. ఆపై అతడి నుంచి శాంపిల్స్ సేకరించి కరోనా వైద్య పరీక్షల కోసం పుణే పంపారు. ఆ పరీక్షల నివేదిక ఇవాళ వచ్చింది. అతడికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దాంతో ఐసోలేషన్ వార్డులోనే అతడికి చికిత్స కొనసాగిస్తున్నారు. ఆ వ్యక్తి కుటుంబాన్ని గృహ నిర్బంధంలో ఉంచారు.