Vellampalli Srinivasa Rao: మాన్సాస్ ట్రస్టు విషయంలో మేం చట్టబద్ధంగానే వ్యవహరించాం: మంత్రి వెల్లంపల్లి 

AP minister Vellampalli responds on Mansas Trust issue
  • తామేమీ చీకటి జీవోలు ఇవ్వలేదన్న వైసీపీ మంత్రి
  • ట్రస్టుపై ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయని వెల్లడి
  • చైర్మన్ గా అశోక్ గజపతిరాజు అక్రమాలకు పాల్పడ్డారంటూ వ్యాఖ్యలు
  • విచారణ జరిపి వాస్తవాలు వెలికితీస్తామని ఉద్ఘాటన
మాన్సాస్ ట్రస్టు వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మాన్సాస్ ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో, ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. మాన్సాస్ ట్రస్టు అంశంలో తాము చట్టబద్ధంగానే వ్యవహరించామని స్పష్టం చేశారు. తామేమీ చీకటి జీవోలు ఇవ్వలేదని తెలిపారు. అశోక్ గజపతిరాజు హయాంలో ట్రస్టులో అక్రమాలు జరిగాయని, చైర్మన్ గా ఉండి అక్రమాలకు పాల్పడినట్టు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. విచారణ జరిపి అన్ని నిజాలు వెలికితీస్తామని చెప్పారు. ట్రస్టుపై ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయని మంత్రి వెల్లంపల్లి ఉద్ఘాటించారు.
Vellampalli Srinivasa Rao
Mansas Trust
YSRCP
Ashok Gajapathi Raju

More Telugu News