KCR: రేపటి నుంచి రాజగోపాల్​ రెడ్డి ఇంటికి కరెంట్​ బంద్​ చేయిద్దామంటూ కేసీఆర్​ సెటైర్లు

CM Kcr satires on Mla Komatireddy
  • తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తున్నాం
  • ఈ విషయమై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి
  • కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం విమర్శలు చేస్తున్నారు!
తెలంగాణలో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్న తమ ప్రభుత్వంపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తుంటే, టీ– కాంగ్రెస్ నాయకులు మాత్రం విమర్శలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ ఆయన మాట్లాడుతూ, ఇరవై నాలుగు గంటల కరెంట్ వద్దని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటున్నారని, రేపటి నుంచి ఆయన ఇంటికి కరెంట్ బంద్ చేయిస్తే పోతుందంటూ కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నాయకుల ‘నెగెటివ్ థింకింగ్’ గురించి ఏం చెబుతాం? అని ప్రశ్నించారు.

KCR
TRS
Telangana
Assemblya
Komatireddy Raj Gopal Reddy

More Telugu News