పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దిశ నిందితుడు చెన్నకేశవులు భార్య
- నెలలు నిండడంతో మొన్న ఆసుపత్రిలో చేరిన చెన్న కేశవులు భార్య
- నిన్న ఆడపిల్ల పుట్టిందని తెలిపిన వైద్యులు
- తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని ప్రకటన
ఆమెకు పండంటి ఆడపిల్ల పుట్టిందని తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆమెది మహబూబ్ నగర్ జిల్లా, మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామం. కాగా, హైదరాబాద్ పోలీసుల చేతిలో చెన్నకేశవులు ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అతడి భార్య గర్భవతి. ఆమె చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది.