సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Alia Bhat to be cast opposite NTR
  • ఎన్టీఆర్ కి జోడీగా బాలీవుడ్ భామ 
  • 'అర్జున'గా వస్తున్న డాక్టర్ రాజశేఖర్
  • సల్మాన్ కి ఒక రోజుకి ఏడు కోట్లు! 
 *  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందే చిత్రం కోసం ఇద్దరు హీరోయిన్లను తీసుకుంటున్నారు. వీరిలో ఒకరిగా పూజ హెగ్డేను ఇప్పటికే ఎంపిక చేయగా, మరొకర్ని బాలీవుడ్ నుంచి ఎంపిక చేస్తారట. ఆలియా భట్ కానీ, జాన్వీ కపూర్ ను కానీ తీసుకోవచ్చని తెలుస్తోంది.
*  తమిళ దర్శకుడు కన్మణి దర్శకత్వంలో డాక్టర్ రాజశేఖర్ ద్విపాత్రాభినయంతో 'అర్జున' చిత్రం రూపొందింది. ఈ నెల 6న విడుదల కావలసిన ఈ చిత్రాన్ని ఈ నెల 13న విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు. ఇందులో రాజశేఖర్ వృద్ధుడైన రైతుగా ఒక పాత్రను, ఆయన తనయుడిగా మరో పాత్రను పోషించారు.
*  చాలా మంది స్టార్లు సినిమాల కన్నా వాణిజ్య ఉత్పత్తులకు ప్రచారకర్తగా పనిచేయడం వల్లే ఎక్కువగా సంపాదిస్తున్నారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా బ్రాండింగ్ ద్వారా బాగా సంపాదిస్తున్నాడు. ఇటీవల 'రియల్ మీ' మొబైల్ ఫోన్ల ప్రచారానికి సంబంధించిన ఒక్క రోజు షూటింగులో పాల్గొన్నందుకు సల్మాన్ 7 కోట్లు చార్జ్ చేసినట్టు సమాచారం. 
Go Back to Shorts
Alia Bhat
Junior NTR
Trivikram Srinivas
Rajashekhar

More Telugu News