Akhil Akkineni: షూటింగ్‌లో యువ నటుడు అఖిల్‌కు గాయం.. వారం వరకు షూటింగ్ బంద్!

Akhil Akkineni injured during the shooting of Most Eligible Bachelor
  • ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ సినిమా షూటింగులో గాయం
  • వారం రోజులు విశ్రాంతి అవసరమన్న వైద్యులు
  • 10వ తేదీ తర్వాత తిరిగి షూటింగుకు
టాలీవుడ్ యువ నటుడు అక్కినేని అఖిల్ గాయపడ్డాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా అఖిల్ కుడి భుజానికి గాయమైంది. గాయం చిన్నదే అయినప్పటికీ వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమన్న వైద్యుల సూచనతో షూటింగును నిలిపివేశారు.

ఈ నెల 10 తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. గీతా ఆర్ట్స్ 2 పిక్సర్స్ బ్యానర్‌పై బన్సీవాసు ఈ సినిమాను నిర్మిస్తుండగా, గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. 70 శాతం షూటింగ్ పూర్తయింది. వేసవి సెలవుల్లో సినిమాను విడుదల చేయనున్నారు.
Akhil Akkineni
Tollywood
Most Eligible Bachelor

More Telugu News