Vijay Sai Reddy: 'నారా వైరస్' కు ప్రజలు వ్యాక్సిన్ ఎప్పుడో కనిపెట్టేశారు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy satires on Chandrababu and Nara Lokesh
  • కరోనా కంటే 'నారా వైరస్' భయంకరమైనదన్న విజయసాయి
  • పది నెలల కిందటే 'నారా వైరస్' ను ప్రజలు తరిమికొట్టారని ట్వీట్
  • మళ్లీ వ్యాప్తి చెందేందుకు అబ్బాకొడుకులు కిందా మీదా పడుతున్నారని వ్యంగ్యం
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో టీడీపీ అధినాయకత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'నారా వైరస్' కరోనా కంటే భయంకరమైనదని, కరోనా వైరస్ కు ఇంకా చికిత్స కనుగొనాల్సి ఉన్నా, ప్రజలు మాత్రం 'నారా వైరస్' కు వ్యాక్సిన్ కనిపెట్టేశారని ట్వీట్ చేశారు. ఆ వ్యాక్సిన్ తో పది నెలల కిందటే వైరస్ ను తరిమికొట్టారని, మళ్లీ వ్యాప్తి చెందేందుకు అబ్బా కొడుకులు కిందా మీదా పడుతున్నారని, కుల మీడియాదీ అదే పరిస్థితి అని వ్యాఖ్యానించారు.
Vijay Sai Reddy
Corona Virus
Nara Lokesh
Chandrababu
Vaccine
Andhra Pradesh

More Telugu News