T20 World Cup: మహిళల టీ20 వరల్డ్ కప్: భారత్ ప్రత్యర్థి ఎవరు?.. ఆసక్తికరంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సెమీఫైనల్

who will win in t20 world cup semifinal
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 134 రన్స్ చేసిన ఆస్ట్రేలియా
  • వర్షం రావడంతో దక్షిణాఫ్రికా టార్గెట్ 13 ఓవర్లలో 98 పరుగులుగా సవరింపు
  • ఐదు ఓవర్లకు 26/3తో ఎదురీదుతోన్న సఫారీ జట్టు

మహిళల టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య సెమీఫైనల్ రసవత్తరంగా నడుస్తోంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. కెప్టెన్‌ మెగ్ లానింగ్ 49 పరుగులతో అజేయంగా నిలవగా.. బెత్ మూనీ 28 రన్స్‌తో ఆకట్టుకుంది.

ఇక సఫారీ బౌలర్లలో నెడైన్ డి క్లెర్క్ మూడు వికెట్లు పడగొట్టింది. అయితే, ఆసీస్ ఇన్నింగ్స్ అనంతరం వర్షం రావడంతో దక్షిణాఫ్రికా విజయ లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్‌ పద్ధతిలో 13 ఓవర్లలో 98 పరుగులుగా సవరించారు. ఇక లక్ష్య ఛేదనను మెరుగ్గానే ఆరంభించిన సఫారీ టీమ్ వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయి ఐదు ఓవర్లకు 26/3తో నిలిచింది. ఆ జట్టు విజయానికి మరో 48 బంతుల్లో 78 పరుగులు కావాలి.

కాగా, ఉదయం భారత్, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన సెమీ ఫైనల్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దాంతో గ్రూప్‌ దశలో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది.

  • Loading...

More Telugu News