MP Navneet: లోక్‌సభలో మాస్కు ధరించి ప్రశ్న అడిగిన ఎంపీ నవనీత్‌

MP Navneet Ravi Rana asks question wearing mask in Lok Sabha
  • మాస్కులతో పార్లమెంట్‌కు హాజరైన నవనీత్, ఇతర ఎంపీలు
  • రాజకీయ నాయకులనూ భయపెడుతున్న కరోనా వైరస్‌
  • ముందు జాగ్రత్తగా మాస్కులు ధరిస్తున్న నేతలు
దేశంలో ప్రవేశించిన కరోనా వైరస్‌ ప్రజలనే కాదు రాజకీయ నాయకులను కూడా భయపెడుతోంది. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. అలాగే, ప్రజలు కూడా వ్యక్తిగత శుభ్రత పాటించడంతో పాటు ముఖానికి మాస్కులు ధరిస్తున్నారు. ఇక, నిత్యం ప్రజలు, అధికారులను కలిసే రాజకీయ నేతలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ప్రస్తుతం పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతుండడంతో మహారాష్ట్రకు చెందిన ఇండిపెండెంట్ ఎంపీ నవనీత్‌ కౌర్‌‌ రాణాతో పాటు పలువురు ఎంపీలు ముఖానికి మాస్కులు ధరించి లోక్‌సభకు వచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో విద్యుత్‌ సప్లై గురించి ప్రశ్నిస్తున్నప్పుడు కూడా నవనీత్‌ మాస్కు ధరించడం గమనార్హం. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన నవనీత్‌ ఇప్పుడు మహారాష్ట్రలోని ఆమ్రావతి నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
MP Navneet
Lok Sabha
Corona Virus
mask

More Telugu News