Dog: హాంకాంగ్ లో కుక్కకు కరోనా వైరస్.. మనిషి నుంచి జంతువుకు పాకిన తొలి కేసుగా రికార్డ్!

Pet Dog In Hong Kong First Case Of Human To Animal Coronavirus Transmission
  • హాంకాంగ్ లో తొలి కేసు నమోదు
  • జంతువుల క్వారంటైన్ లో చికిత్స
  • ఐసొలేషన్ లో మరో రెండు కుక్కలు
ఇప్పటి వరకు మనుషలపైనే పంజా విసిరిన కరోనా వైరస్... ఇప్పుడు జంతువులను కూడా టార్గెట్ చేస్తోంది. హాంకాంగ్ లో ఓ పెంపుడు కుక్కకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. మనిషి నుంచి జంతువుకు కరోనా వైరస్ సోకిన తొలి కేసుగా ఇది ప్రపంచ రికార్డుపుటల్లోకి ఎక్కింది. ఈ కుక్కను 60 ఏళ్ల మహిళ పెంచుకుంటోంది. ఆమె నుంచే కుక్కకు కరోనా సోకింది. దీంతో దాన్ని జంతువుల క్వారంటైన్ కు పంపించారు. గత శుక్రవారం నుంచి దానికి క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో దానికి బలహీన స్థాయిలో కరోనా వైరస్ ఉందని రిపోర్ట్ వస్తోంది.

గత శుక్రవారం హాంకాంగ్ ప్రభుత్వం పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక క్వారంటైన్ ను ఏర్పాటు చేసింది. వైరస్ బారిన పడిన జంతువులను 14 రోజుల పాటు అక్కడ ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ కరోనా వైరస్ సోకిందని అనుమానిస్తున్న మరో రెండు కుక్కలను ఐసొలేషన్ లో ఉంచారు. ఈ రెండు కుక్కలలో ఒక దానికి కరోనా నెగెటివ్ అని తేలింది. దానికి మరోసారి పరీక్ష నిర్వహించి, మళ్లీ నెగెటివ్ అని తేలితే ఐసొలేషన్ నుంచి విడుదల చేయనున్నారు. మరో కుక్క గురించి వివరాలు తెలియాల్సి ఉంది.
Dog
Corona Virus
Hong Kong
First Animal Case
Human to Animal Transmission

More Telugu News