Chittoor District: చైనా నుంచి వచ్చిన చిత్తూరు జిల్లా ఇంజినీర్ కోసం అధికారుల గాలింపు!

Chittor Officials searching for an Engineer who came from China
  • చైనాలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న జిల్లా వాసి
  • గత నెల 25న విమానంలో బెంగళూరుకు
  • అప్పటి నుంచి కనిపించకుండా పోయిన వైనం
చైనా నుంచి వచ్చిన చిత్తూరు జిల్లావాసి కోసం అధికారులు గాలింపు మొదలుపెట్టారు. జిల్లాలోని ఎర్రావారిపాలెం, నెరబైలుకు చెందిన కుండ్ల గిరిధర్ చైనాలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గత నెల 25న చైనా నుంచి స్వదేశానికి ఆయన తిరిగొచ్చాడు.

బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాతి నుంచి ఆయన కనిపించకుండా పోయాడు. కరోనా వైరస్ కలకలం నేపథ్యంలో ఆయన కనిపించకుండా పోవడం సంచలనమైంది. విషయం తెలిసిన వైద్యాధికారులు ఆయన కోసం గ్రామానికి వెళ్లి ఆరా తీసినట్టు తెలిసింది. అయితే, ఈ విషయం తమ దృష్టికి రాలేదని  వైద్య, పోలీసు శాఖ ఉన్నతాధికారులు చెబుతుండడం గమనార్హం.
Chittoor District
Engineer
China
Andhra Pradesh

More Telugu News