JC Diwakar Reddy: చంద్రబాబును చావగొట్టకుండా వదిలిపెట్టారు.. అది ఆయన అదృష్టం: జేసీ సంచలన వ్యాఖ్యలు

TDP Leader JC Sensational comments on Chandrababu
  • జైలు నుంచి విడుదలైన టీడీపీ ఉపాధ్యక్షుడు చింబిలి వెంకటరమణ
  • పరామర్శించిన జేసీ
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటన
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన చంద్రబాబును వైసీపీ మద్దతుదారులు చావగొట్టకుండా వదిలిపెట్టడం ఆయన అదృష్టమని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ పోటీ చేయడం లేదని పేర్కొన్నారు.

తాడిపత్రి మునిసిపాలిటీతోపాటు నియోజకవర్గంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి ఎవరూ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఒక వేళ పోటీ చేసినా అనర్హత వేటు వేస్తారని, లేదంటే కొత్త చట్టాల పేరుతో జైలులో వేస్తారని, దానికంటే పోటీ చేయకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. వివిధ కేసుల్లో చిక్కుకుని రెండు నెలలపాటు జైలు శిక్ష అనుభవించిన జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు చింబిలి వెంకటరమణ నిన్న విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయనను పరామర్శించేందుకు అక్కన్నపల్లికి వెళ్లిన జేసీ ఈ వ్యాఖ్యలు చేశారు.
JC Diwakar Reddy
Anantapur District
Telugudesam
Andhra Pradesh
Chandrababu

More Telugu News