Budda Venkanna: తొమ్మిది నెల‌ల క్రితం ఏపీకి ‘జగరోనా' వైరస్​ సోకింది: బుద్ధా వెంకన్న

  • ‘కరోనా అమ్మ మొగుడు ’జగరోనా’ వైరస్
  • ఈ విషయం ఇంకా మీ చెవికి చేరలేదా విజయసాయిరెడ్డి గారూ?
  • ఈ వైరస్ తో ఏపీ ఆదాయం ఆవిరైంది
TDP Leader Budda Venkanna ironies Ap is suffering from Jagarona virus

ప్రపంచాన్ని ప్రస్తుతం వణికిస్తున్న వైరస్ ‘కరోనా‘. ఆ పదంలో ‘క’ బదులు ‘జగ‘ను ఉంచి ‘జగరోనా‘ వైరస్ అంటూ ఏపీ సీఎం జగన్ ని విమర్శిస్తూ ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. ‘కరోనా అమ్మ మొగుడు ’జగరోనా’ అని ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు. ఇంకా మీ చెవికి చేరలేదా? అంటూ విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

తొమ్మిది నెల‌ల క్రితం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి సోకిన ఈ ‘జగరోనా’ వైర‌స్‌తో అభివృద్ధి అంత‌మైందని, ఆదాయం ఆవిరైందని, రాష్ట్ర‌మంతా ఈ వైర‌స్ ఎఫెక్ట్‌తో అల్లాడిపోతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ’జగరోనా’ వైర‌స్‌ని క‌ట్ట‌డి చేయ‌గ‌ల శ‌క్తి ప్ర‌స్తుతం సెర్బియా దేశానికే ఉంద‌ంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

More Telugu News