Manchu Manoj: సంవత్సరంలో అన్ని పండగలు ఒక్క రోజులో జరుపుకునేలా ఉందీ పోస్టర్: మంచు మనోజ్

Manchu Manoj comments on Pawan Kalyan new movie Vakeel Saab first look
  • వకీల్ సాబ్ చిత్రంలో నటిస్తున్న పవన్ కల్యాణ్
  • తాజాగా వకీల్ సాబ్ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
  • పవన్ లుక్ తో టాలీవుడ్ ఫిదా
  • జనసేనానికి విషెస్ తెలిపిన మంచు మనోజ్
టాలీవుడ్ మొత్తం పవన్ కల్యాణ్ నామస్మరణ చేస్తోంది. అందుకు కారణం, ఇవాళ వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కావడమే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో పవన్ ఓ న్యాయవాది పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు ఇది రీమేక్. తాజాగా, పవన్ గెటప్ తో రిలీజైన ఫస్ట్ లుక్ ట్విట్టర్ లో దున్నేస్తోంది. లక్షల్లో ట్వీట్లతో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. దీనిపై యువనటుడు మంచు మనోజ్ స్పందించారు. సంవత్సరంలో ఉన్న పండగలన్నీ అభిమానులు ఒక్కరోజులో జరుపుకునేలా ఉందీ పోస్టర్ అంటూ వ్యాఖ్యానించారు. త్వరలోనే తెరపై కనిపించనున్న జనసేనాని పవన్ కల్యాణ్ గారికి, వకీల్ సాబ్ చిత్రబృందానికి బెస్ట్ విషెస్ అంటూ ట్వీట్ చేశారు.
Manchu Manoj
Pawan Kalyan
Vakeel Saab
Tollywood
Fans
Festival
First Look

More Telugu News