మూడు పరోటాలను 50 నిమిషాల్లో తింటే లక్ష రూపాయల ప్రైజ్!
- హర్యానాలో పరోటాలకు పేరుగాంచిన హోటల్ తపస్య
- ప్రత్యేకంగా జంబో పరోటాలు తయారీ
- ఒక్కోటి రెండున్నర అడుగుల మేర ఉండే నేతి పరోటాలు
- నిర్ణీత సమయంలో తిన్నవారికి నగదుతో పాటు జీవితాంతం ఫుడ్ ఫ్రీ
సాధారణంగా ఒక్కో జంబో పరోటాను ఐదుగురు తింటారు. వీటి ధర రూ.300 నుంచి మొదలవుతాయి. నేతితో తయారయ్యే ఈ భారీ పరోటాలను తినేందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. గత 14 ఏళ్లుగా ఈ పోటీలు జరుగుతున్నా ఇప్పటివరకు నెగ్గింది ఇద్దరంటే ఇద్దరేనట! పోటీల సంగతి ఎలా ఉన్నా తపస్య హోటల్లో తయారయ్యే పరోటాల రుచి ఇంకెక్కడా లభించదని కస్టమర్లు లొట్టలు వేస్తుంటారు.