ప్రతికూల శక్తులకు అమిత్ షా సరైన సమాధానం ఇచ్చారు: ఐవైఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- అలజడుల ద్వారా పౌరసత్వ సవరణను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు
- మీడియాలో ఒక వర్గం అల్పసంఖ్యాక వర్గాల్లో అపోహలు సృష్టించింది
- ప్రజలకు వాస్తవాలు తెలియచెప్పే కార్యక్రమాన్ని చేపట్టాలి
'అలజడుల ద్వారా పౌరసత్వ సవరణను ఆపడానికి ప్రయత్నిస్తున్న శక్తులకు సరైన సమాధానం. మీడియాలో ఒక వర్గం, ముస్లిం నాయకత్వం, వామపక్షాలు ముఖ్యంగా అల్పసంఖ్యాక వర్గాల్లో అపోహలు సృష్టించడంలో సఫలీకృతం అయ్యాయి. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ అంశంపై ప్రజలకు వాస్తవాలు తెలియచెప్పే కార్యక్రమాన్ని చేపట్టాలి' అని ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారు.