Chittoor District: 'నేనే తప్పు చేయలేదు' అంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న నర్సు

girl commits suicide in chittoor
  • చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఘటన
  • నర్సుగా పనిచేస్తోన్న అమ్మాయి (24)
  • ఆసుపత్రిలో చోరీ
  • తనపై అనుమానం వ్యక్తం చేస్తున్నారని మనస్తాపం
చిత్తూరు జిల్లా మదనపల్లెలో విషాద ఘటన చోటు చేసుకుంది.  మదనపల్లెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సావిత్రి (24) సూసైడ్‌ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఆమె రెండురోజుల కిందట నైట్‌ డ్యూటీకి వెళ్లగా, అదే రోజు ఎవరో ఆసుపత్రిలోని ఓ వార్డులో ఓ రోగి నుంచి రూ.2 వేల నగదు, ఏటీఎంకార్డులను చోరీ చేశారు.

దీంతో రోగి బంధువులు ఆసుపత్రికి యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో సావిత్రిని ఆసుపత్రి యాజమాన్యం విచారించింది. ఆమే చోరీ చేసిందని రోగి బంధువులు, తోటి సిబ్బంది మాట్లాడుకున్నారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపం చెందింది. నాలుగు పేజీల సూసైడ్‌నోట్‌ రాసి ఇంట్లో దూలానికి చున్నీతో ఉరేసుకుని, చనిపోయింది.

తాను తప్పు చేయలేదని, ఆ రోగి వద్ద డబ్బు ఎవరు చోరీ చేశారో తనకు తెలియదని ఆమె ఆత్మహత్య లేఖలో తెలిపింది. రోగి బంధువులు, తోటి సిబ్బంది తనపైనే అభాండం వేస్తూ మాట్లాడుకుంటున్నారని చెప్పింది. తన చావుతోనయినా తనను నమ్మాలని పేర్కొంది.  
Chittoor District

More Telugu News