G. Kishan Reddy: అందుకే ఢిల్లీలో హింస చెలరేగుతోంది: కిషన్‌రెడ్డి

kishan reddy on delhi voilance
  • సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు
  • రాజకీయ నేతల రెచ్చగొట్టే తీరు ఎక్కువైంది
  • పాక్‌, బంగ్లా నుంచి చొరబాటుదారులు అధికమయ్యారు
  • వారిక్కడ విధ్వంసాలు సృష్టిస్తున్నారు
సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, రాజకీయ నేతల రెచ్చగొట్టే తీరు వల్లే ఢిల్లీలో హింసాత్మక ఘటనలకు కారణమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ...  పాక్‌, బంగ్లా నుంచి చొరబాటుదారులు అధికమయ్యారని ఆయన తెలిపారు. వారు ఇక్కడ విధ్వంసాలు సృష్టిస్తున్నారని చెప్పారు.

పలు రంగాల్లో అభివృద్ధి సాధిస్తోన్న భారత్‌వైపు ప్రపంచం మొత్తం చూస్తోందని కిషన్‌రెడ్డి చెప్పారు. కేంద్రంలో  నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. దేశంలో పెద్ద నోట్ల రద్దు, జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌-370 రద్దు, జీఎస్టీ వంటి కీలక నిర్ణయాలను తీసుకున్నారని వ్యాఖ్యానించారు.
G. Kishan Reddy
BJP
Hyderabad
New Delhi

More Telugu News