Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ కు బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియావాలా నుంచి భారీ ఆఫర్!

Mahesh Gets Huge Offer From Bollywood
  • యాడ్ షూటింగ్ కోసం ముంబైకి మహేశ్
  • షూటింగ్ స్పాట్ లో కలిసిన సాజిద్
  • రణవీర్ తో కలిసి మల్టీ స్టారర్ ఆలోచన
  • ఇంకా క్లారిటీ ఇవ్వని మహేశ్
లేటెస్ట్ గా 'సరిలేరు నీకెవ్వరు'తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు, బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియావాలా నుంచి భారీ ఆఫర్ వచ్చినట్టుగా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇటీవల ఓ కంపెనీ యాడ్ కోసం బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో కలిసి మహేశ్ బాబు నటించారు. గడచిన రెండేళ్లలో రణవీర్, మహేశ్ కలిసి యాక్ట్ చేయడం ఇది మూడోసారి.

ఈ యాడ్ షూటింగ్ ముంబైలో జరుగుతుండగా, అక్కడికి వచ్చిన సాజిద్, రణవీర్, మహేశ్ లతో భారీ మల్టీ స్టారర్ ను ప్లాన్ చేస్తున్నానని చెబుతూ, నటించాలని కోరారట. బాలీవుడ్ లో రణవీర్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అటువంటి హీరోకు మహేశ్ బాబు కలిస్తే, పాన్ ఇండియా మూవీ అవుతుందన్న ఆలోచనలో ఉన్న సాజిద్, ఇందుకోసం భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశాడని తెలుస్తోంది. గతంలో పలుమార్లు తాను హిందీ సినిమాలు చేయబోనని మహేశ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజా ఆఫర్ పై మహేశ్ నుంచి క్లారిటీ రావాల్సి వుంది.
Mahesh Babu
Sazid Nadiyawala
Ranveer Singh
Multi Starer
Bollywood

More Telugu News