టవల్ ను అమాంతం మింగేసిన కొండచిలువ... బయటకు తీసిన వైద్యులు... వీడియో ఇదిగో!
- ఆస్ట్రేలియాలో ఘటన
- పెంపుడు అనకొండను బీచ్ కు తీసుకెళ్లిన వ్యక్తి
- ఆకలేసి టవల్ ను మింగి అవస్థలు
ఇక ఈ కొండ చిలువను సాశ్ అనే వ్యక్తి పెంచుకుంటున్నాడు. దీనికి మౌంటీ అని పేరు కూడా పెట్టాడు. ఓ రోజు దాన్ని తీసుకుని బీచ్ కి వెళ్లగా, ఆ సమయంలో ఆకలేసిన కొండచిలువ, ఎదురుగా కనిపించిన టవల్ ను గుటుక్కున మింగేసింది. ఆ రోజు సాయంత్రం దానికి స్నాక్స్ తినిపిద్దామని సాశ్ ప్రయత్నించిన వేళ, అది అవస్థ పడుతూ ఉందని గమనించి, హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. దాని కడుపులో జీర్ణం కాకుండా మిగిలిపోయిన భారీ పదార్థం ఉందని గమనించిన వైద్యులు, దాన్ని బయటకు తీశారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.