Congress: మహిళా అధికారితో కాంగ్రెస్‌ నేతల గొడవ.. దీటుగా సమాధానమిచ్చిన అధికారిణి

 A verbal spat ensued between Shahdol Mining Officer  Congress leaders
  • మధ్యప్రదేశ్‌లో ఘటన
  • మైనింగ్‌ ఆఫీసర్ సరిగ్గా పనిచేయట్లేదని గొడవ
  • మైనింగ్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవట్లేదని వాదన 
ఓ మహిళా అధికారితో కాంగ్రెస్ నేతలు గొడవ పడగా ఆయనకు దీటుగా ఆ అధికారిణి సమాధానం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు చిక్కింది. మధ్యప్రదేశ్‌లోని షడోల్‌ మైనింగ్‌ ఆఫీసర్ పర్హత్ జాహన్‌ వద్దకు వచ్చిన కొందరు కాంగ్రెస్‌ నేతలు ఆమెను నిలదీశారు.

అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆమె చర్యలు తీసుకోవట్లేదని వారు గొడవ పెట్టుకున్నారు. దీంతో అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎలా పని చేయాలో తమకు తెలుసని ఆమె ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఆ సమయంలో రాష్ట్ర మైనింగ్‌ శాఖ మంత్రి ప్రదీప్‌ జైశ్వాల్‌ కూడా అక్కడే ఉన్నారు.
Congress
Madhya Pradesh

More Telugu News