Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నివాసం వద్ద భారీగా పోలీసు భద్రత

police protection at chiru house
  • ఇంటి ముందు ధర్నాకు అమరావతి పరిరక్షణ జేఏసీ పిలుపు?
  • చిరంజీవి ఇంటి వద్దకు ఎవరినీ రానీయకుండా బారికేడ్లు
  • చిరంజీవికి ఫ్యాన్స్‌ మద్దతు 
అమరావతి పరిరక్షణ  జేఏసీ నాయకులు హైదరాబాద్‌లోని మెగాస్టార్‌ చిరంజీవి నివాసం ముందు ధర్నాకు పిలుపునిచ్చారంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయన నివాసం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. చిరంజీవి ఇంటి వద్దకు ఎవరినీ రానీయకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.

అయితే, ధర్నాతో తమకు ఎలాంటి సంబంధం లేదని అమరావతి జేఏసీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. చిరంజీవి ఇంటిని ముట్టడిస్తే ఊరుకోబోమని మరోపక్క సామాజిక మాధ్యమాల్లో మెగా అభిమానులు పెద్ద ఎత్తున పోస్టులు చేశారు.

'రాజకీయాల ముసుగులో రాముడి లాంటి మన చిరంజీవి అన్నయ్య మీద జరుగుతున్న కుట్రను ఎదుర్కొందాం. అన్నయ్యకు రక్షణ కవచంగా నిలబడదాం. మెగా ఫాన్స్ పవర్ ఏమిటో చూపిద్దాం. 29వ తేదీ రాష్ట్రంలో ఉన్న ముఖ్య అభిమానులు అందరూ... హైదరాబాద్ లోని చిరంజీవి అన్నయ్య ఇంటికి ఉదయం 8 గంటలకు చేరుకుందాం' అంటూ సామాజిక మాధ్యమాల్లో పిలుపునిస్తున్నారు.
Chiranjeevi
Tollywood
Hyderabad

More Telugu News