శ్రీరెడ్డి నుంచి ప్రాణహాని ఉంది.. పోలీసులకు డ్యాన్స్ మాస్టర్ రాకేశ్ ఫిర్యాదు
- శ్రీరెడ్డి, కరాటే కల్యాణి, డ్యాన్స్ మాస్టర్ రాకేశ్ మధ్య ముదురుతున్న వివాదం
- ఒకరిపై ఒకరు హత్యాయత్నం ఆరోపణలు
- మూడు రోజుల క్రితం శ్రీరెడ్డి.. ఇప్పుడు రాకేశ్
సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తమపై అసభ్యకర పోస్టులు చేసిందని ఆరోపిస్తూ నటి కల్యాణి, డ్యాన్స్ మాస్టర్ రాకేశ్ ఇటీవల హైదరాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రతిగా శ్రీరెడ్డి కూడా కరాటే కల్యాణి, డ్యాన్స్ మాస్టర్ రాకేశ్లపై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఇది జరిగి మూడు రోజులైనా కాకముందే ఇప్పుడు రాకేశ్ మాస్టర్ ఆమెపై ఫిర్యాదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.