గుజరాత్ లో ఘోరం... మూడు రోజుల పసికందుపై 20 కత్తిపోట్లు!
- బహిరంగ ప్రదేశంలో రోజుల బాలిక
- కుక్క ఈడ్చుకుని వెళుతుంటే చూసిన యువకులు
- ఆసుపత్రిలో కోలుకుంటున్న పసికందు
పాప శరీరంపై 20 వరకూ కత్తిపోట్లు ఉన్నాయని, నోటిలో మట్టి పోసి, ఆ ప్రాంతంలో వదిలి వెళ్లారని వైద్యులు గుర్తించారు. నోటిలో మట్టి దూరడంతో ఊపిరి తీసుకోవడం కష్టం కాగా, మట్టిని తొలగించామని, పాపకు వైద్యం కొనసాగుతోందని, ఆరోగ్యం స్థిరంగానే ఉందని అన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి, దర్యాఫ్తు ప్రారంభించారు. ఆడపిల్ల పుట్టిందన్న కారణంతోనే ఎవరో ఇలా చేసి వుండవచ్చని అంచనా వేశారు.