Glenn McGrath: సచిన్‌ కంటే లారాకు బౌలింగ్​ చేయడమే కష్టం: మెక్‌గ్రాత్​

Brian Lara was slightly harder to bowl to than Sachin Tendulkar says Glenn McGrath
  • ఇద్దరూ గొప్ప ఆటగాళ్లే 
  • కానీ లారా నిర్భయంగా బ్యాటింగ్ చేసేవాడు 
  • ఆస్ట్రేలియాపై ఎన్నో సెంచరీలు కొట్టాడన్న పేస్ లెజెండ్
తన కెరీర్‌‌లో అద్భుతమైన పేస్ బౌలింగ్తో ఎంతో మంది బ్యాట్స్మెన్‌ను గడగడలాడించిన మెక్‌గ్రాత్‌కు భారత దిగ్గజ క్రికెటర్‌‌ సచిన్‌ టెండూల్కర్‌‌ చాలా సార్లు దీటుగా సమాధానం చెప్పాడు.  అయితే  సచిన్‌ కంటే వెస్టిండీస్‌ క్రికెట్‌ గ్రేట్ బ్రియాన్‌ లారాకు బౌలింగ్ చేసేందుకే తాను ఇబ్బంది పడ్డానని మెక్‌గ్రాత్ అంటున్నాడు.

సచిన్‌, లారా ఇద్దరూ అద్భుతమైన బ్యాట్స్మెనే అన్నాడు. అయితే, సచిన్‌తో పోల్చితే లారా మరింత స్వేచ్ఛగా, నిర్భయంగా బ్యాటింగ్ చేస్తాడని తెలిపాడు. అందుకే  లారాకు బౌలింగ్‌ చేయడం కష్టమైన పని అని చెప్పాడు.లారా ఎప్పుడూ తన శైలిని మార్చుకోలేదన్నాడు. తనతో పాటు షేన్ వార్న్ ఉన్నప్పుడు కూడా ఆస్ట్రేలియాలో లారా అత్యధిక పరుగులు చేశాడని చెప్పాడు. తాను లారాను 15 సార్లు ఔట్ చేసి ఉంటానని గుర్తు చేసుకున్నాడు. కానీ, ఆసీస్పై అతను ఎన్నో సెంచరీలు, డబుల్ సెంచరీలు చేసి ప్రతీకారం తీర్చుకున్నాడని చెప్పాడు. అదే లారా లక్షణమని తెలిపాడు.

కాగా, కెరీర్‌‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత మెక్‌గ్రాత్ చాలా బిజీగా ఉన్నాడు. చెన్నైలోని ప్రతిష్ఠాత్మక ఎమ్‌ఆర్‌‌ఎఫ్ ఫౌండేషన్ బౌలింగ్‌ గురుగా, కార్పొరేట్ స్పీకర్‌‌గా, టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా వ్యహరిస్తున్నాడు. అలాగే, ఆస్ట్రేలియాలో అతి పెద్ద క్యాన్సర్ ఫౌండేషన్‌ను కూడా నిర్వహిస్తున్నాడు.
Glenn McGrath
Brian Lara
Sachin Tendulkar

More Telugu News