ఐబీ అధికారి హత్యకేసులో ఆరోపణలు.. తమ పార్టీ నేత తాహిర్ హుస్సేన్‌పై వేటేసిన కేజ్రీవాల్
- ఐబీ అధికారి అంకిత్ శర్మ దారుణ హత్య
- ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌పై కేసు నమోదు
- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కేజ్రీవాల్
ఈ హత్య వెనక తాహిర్ ఉన్నాడని అంకిత్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలను తాహిర్ ఖండించారు. నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, తాహిర్ హుస్సేన్ కర్మాగారం, నివాసం చాంద్‌బాగ్ అల్లర్లకు కేంద్రాలుగా మారినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. తాహిర్ నివాసంపైకెక్కిన వందలాది మంది పెట్రోలు, యాసిడ్ బాంబులు విసిరిన దృశ్యాలు మీడియా ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో స్పందించిన కేజ్రీవాల్ తాహిర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు నిన్న రాత్రి ప్రకటించారు.