Chandrababu: చంద్రబాబు పర్యటన.. విశాఖ విమానాశ్రయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు

chandrababu fires on ap govt
  • విశాఖ విమానాశ్రయం వద్ద భారీగా పోలీసుల మోహరింపు
  • పోలీసులు అడ్డుకోవడంతో నినాదాలు చేస్తున్న వైసీపీ కార్యకర్తలు
  • చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలు
  • పర్యటనకు ఆంక్షలు పెట్టడంపై చంద్రబాబు ఆగ్రహం  
ప్రజా చైతన్య యాత్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. విశాఖ బ్రాండ్‌ను దెబ్బతీసిన వైసీపీకి టీడీపీని ప్రశ్నించే హక్కులేదన్నారు.

తన పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారని చెప్పారు. తన పర్యటనకు పోలీసులు ఆంక్షలు పెట్టడం సరికాదని అన్నారు. తనను అడ్డుకునేందుకు వైసీపీ అన్ని విధాలా ప్రయత్నాలు జరుపుతోందని చెప్పారు. అనంతరం తన నివాసం నుంచి ఉత్తరాంధ్ర పర్యటనకు బయలుదేరారు.

మరోపక్క, చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడానికి వైసీపీ కార్యకర్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖ విమానాశ్రయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు అడ్డుకోవడంతో వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
Chandrababu
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News