Prashant Kishor: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌పై పలు సెక్షన్ల కింద కేసుల నమోదు

cheating case against prashant kishor
  • బీహార్‌లో పీకే ‘బాత్‌ బీహార్‌ కీ’ పేరుతో ఓ కార్యక్రమం 
  • తన ఐడియాను పీకే కాపీ కొట్టారన్న ఓ యువకుడు
  • 402, 406 సెక్షన్ల కింద కేసులు నమోదు 
బీహార్‌లో తాను ‘బాత్‌ బీహార్‌ కీ’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించి యువతను కలుస్తానని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఇటీవలే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, తన ఐడియాను కాపీ కొట్టి పీకే ఈ కార్యక్రమాన్ని రూపొందించారంటూ ఆయనపై ఓ యువకుడు చీటింగ్ కేసు పెట్టాడు.

‘బాత్‌ బిహార్‌ కీ’ కార్యక్రమం తన ఆలోచన అని, ఈ ఐడియాను తన మాజీ సహోద్యోగి ఒసామా ప్రశాంత్‌ కిశోర్‌కు చెప్పాడని  మోతీహారీకి చెందిన గౌతమ్‌ అనే యువకుడు అంటున్నాడు. ఇప్పటికే తాను ‘బిహార్‌ కీ బాత్‌’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించానని తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు ఇచ్చాడు.

ప్రశాంత్ కిశోర్‌తో పాటు ఒసామాపై 402, 406 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  కాగా, దేశంలో ఉత్తమ రాష్ట్రాల్లో బీహార్‌ను ఒకటిగా చేసేందుకే తాను ‘బాత్‌ బీహార్‌ కీ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని చెప్పిన పీకే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.
Prashant Kishor
bihar

More Telugu News