నూజివీడు ట్రిపుల్ ఐటీ సమీపంలో దారుణం.. తండ్రి కోసం ఎదురుచూస్తున్న బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం
- బయటకు వెళ్లిన తండ్రి రాకపోవడంతో రోడ్డుపైకి వచ్చి ఎదురుచూపు
- బెదిరించి అత్యాచారం చేసిన నిందితుడు
- నిందితుడి కోసం రంగంలోకి ప్రత్యేక బలగాలు
నూజివీడుకు చెందిన వ్యక్తి పనిపై బయటకు వెళ్లి రాత్రయినా తిరిగి రాకపోవడంతో కంగారు పడిన కుమార్తె రోడ్డుపైకి వచ్చి ఎదురుచూడసాగింది. అదే సమయంలో అటునుంచి వెళ్తున్న నిందితుడు ఆమెను బెదిరించి ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ట్రిపుల్ ఐటీ సమీపంలో వదిలేసి పరారయ్యాడు. రోడ్డుపై ఏడుస్తూ బాలిక పోలీసుల కంట పడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో మరింత మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం వేట ప్రారంభించారు.