కరాటే కల్యాణి, డ్యాన్స్ మాస్టర్ రాకేశ్ నుంచి ప్రాణహాని.. పోలీసులకు శ్రీరెడ్డి ఫిర్యాదు
- శ్రీరెడ్డి.. కరాటే కల్యాణి, రాకేశ్ మధ్య ముదురుతున్న వార్
- ఒకరిపై ఒకరు ఫిర్యాదులు
- చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శ్రీరెడ్డి ఫిర్యాదు
సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తమపై అసభ్యకర పోస్టులు చేసిందని ఆరోపిస్తూ నటి కల్యాణి, డ్యాన్స్ మాస్టర్ రాకేశ్ ఇటీవల హైదరాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి వీరిద్దరిపై కేసు పెట్టడం గమనార్హం.