మోదీ, ట్రంప్ సంభాషణపై తనదైన శైలిలో స్క్రిప్ట్ రాసిన రామ్ గోపాల్ వర్మ!
- భారత పర్యటన ముగించుకుని స్వదేశానికి వెళ్లిపోయిన ట్రంప్
- మోదీ, ట్రంప్ లపై వర్మ ప్యారడీ
- డాలర్ తో గుజరాతీలను పోల్చిన వర్మ
ట్రంప్: మిస్టర్ మోదీ, నన్ను చూసేందుకు 70 లక్షల మంది వస్తారని చెప్పారు. కానీ వచ్చింది లక్ష మందే కదా!
మోదీ: మిస్టర్ ట్రంపీ... మీరిక్కడో విషయం గమనించాలి! ఒక డాలర్ తో 70 రూపాయలు సమానమైతే, ఒక గుజరాతీ 70 మంది అమెరికన్లకు సమానం...!!
మొత్తమ్మీద వర్మ అతిపెద్ద ప్రజాస్వామిక దేశాల పాలకుల సంభాషణను కూడా తన చాతుర్యంతో చమత్కారభరితం చేసేశారు.