భారత సంతతి అమ్మాయిని పెళ్లాడబోతున్న ఆస్ట్రేలియా డాషింగ్ క్రికెటర్
- విని రామన్ తో గ్లెన్ మ్యాక్స్ వెల్ ప్రేమాయణం
- ఇటీవలే నిశ్చితార్థం జరుపుకున్నట్టు వెల్లడించిన మ్యాక్స్ వెల్
- మెల్బోర్న్ లో ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్న విని
విని రామన్ కుటుంబం చాన్నాళ్ల కిందట ఆస్ట్రేలియాలో స్థిరపడింది. విని మెల్బోర్న్ లో ఫార్మసిస్ట్ గా పనిచేస్తోంది. కొంతకాలంగా వీరిద్దరూ అనేక సందర్భాల్లో మీడియా కెమెరాలకు చిక్కారు. ఓ దశలో విరామం లేని క్రికెట్ కారణంగా మ్యాక్స్ వెల్ మానసిక సమస్యలతో సతమతమయ్యాడు. మ్యాక్స్ వెల్ బాధపడుతోంది మానసిక సమస్యలతోనే అని మొదట గుర్తించింది వినీయేనట! ఆమె సహచర్యంలోనే ఈ విధ్వంసక క్రికెటర్ త్వరగా కోలుకుని, పునరుత్తేజంతో మైదానంలో అడుగుపెట్టాడు. దాంతో ఇద్దరి మధ్య అనుబంధం మరింత బలపడింది.