కరోనా మృతులు ఏ దేశంలో ఎంతమంది?... వివరాలివిగో!
- చైనాలో వేలమందిని మింగేసిన కరోనా వైరస్
- ఇతర దేశాల్లోనూ ప్రభావం చూపిస్తున్న మహమ్మారి
- ఇరాన్ లో 16 మంది, ఇటలీలో 11 మంది మృత్యువాత
ఇప్పటివరకు ఇరాన్ లో 16 మంది మృత్యువాత పడ్డారు. ఇరాన్ లో వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ మంత్రి కూడా కరోనా బాధితులయ్యారు. దక్షిణ కొరియాలో 8 మంది మరణించగా, వైరస్ బాధితుల సంఖ్య 1,146కి పెరిగింది. యూరప్ దేశం ఇటలీ కూడా కరోనా ముప్పు ఎదుర్కొంటోంది. కరోనా కారణంగా ఇటలీలో 11 మంది చనిపోయారు. ఒక్క మంగళవారం నాడే నలుగురు మరణించడంతో ఇటలీ ప్రజలు భీతిల్లిపోతున్నారు.