భార్య, కుమారుడితో పాటు లొంగిపోయిన ఆజంఖాన్.. జైలుకు తరలింపు!
- ఏడు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించిన కోర్టు
- ఆజంఖాన్ కుటుంబంపై పలు కేసులు
- తదుపరి విచారణ మార్చి 2వ తేదీకి వాయిదా
ఆజంఖాన్ పై భూకబ్జా, పుస్తకం దొంగతనం, విద్యుత్ చౌర్యం, విగ్రహం దొంగతనం, గేదె దొంగతనం, గొర్రె దొంగతనం వంటి కేసులు ఉన్నాయి. పుట్టినతేదీ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసిన కేసు అబ్దుల్లా ఆజంపై ఉంది. ఎన్నోసార్లు సమన్లు జారీ చేసినా వీరు కోర్టుకు హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ ను కోర్టు జారీ చేసింది.