పోజులివ్వడం ఆపి.. ముందు ఆడండి: ఇషాంత్​, మయాంక్​ లకు ఫ్యాన్స్​ ట్రోలింగ్​

  • ఇంటర్నెట్ లో కాదు పిచ్ పై పోజులివ్వాలంటూ కామెంట్లు
  • అక్కడికి వెళ్లింది షాపింగ్ కు కాదంటూ విమర్శలు
  • అసలు తొలి టెస్టులో బాగా ఆడింది వారిద్దరే..
న్యూజిలాండ్ తో తొలి టెస్టులో టీమిండియా ఏకంగా ఇన్నింగ్స్ తేడాతో దారుణంగా ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీమిండియా ఆటగాళ్ల తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో టీమిండియా ఆటగాళ్లు సరదాగా బయటికి వెళ్లిన ఫొటోను ఇషాంత్ శర్మ, మయాంక్ అగర్వాల్ పోస్టు చేయడంతో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ముందు ఫొటోలకు పోజులివ్వడం ఆపి.. ఆడటం మొదలుపెట్టండి అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఆ ఫొటోలో ఇషాంత్, మయాంక్ తోపాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ కూడా ఉన్నారు.

ఏమని కామెంట్స్ చేశారు?

  • పోజులివ్వడం మానేసి.. ఆడటం మొదలు పెట్టండి
  • 90వ దశాబ్దం నాటి టీమ్ గ్రౌండ్ లో పిచ్ పై పోజులిచ్చేది.. ఇప్పటి టీమ్ కేవలం ఇంటర్నెట్ లో పోజులిస్తోంది
  • అటూ ఇటూ తిరగడం ఆపండి, ప్రాక్టీసు చేసి బాగా ఆడండి.. మీరు షాపింగ్ చేయడానికి అక్కడికి వెళ్లలేదు.

ఆ ఇద్దరూ బాగానే ఆడారు

నిజానికి ఫొటో పోస్టు చేసి ఫ్యాన్స్ ట్రోలింగ్ కు గురవుతున్న ఇషాంత్, మయాంక్ ఇద్దరూ తొలి టెస్టులో బాగానే ఆడటం గమనార్హం. మయాంక్ 92 పరుగులు చేసి టీమిండియా తరఫున టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇషాంత్ తొలి ఇన్నింగ్స్ లో ఒక్కడే ఐదు వికెట్లు కూడా తీశాడు. కానీ టీమిండియా దారుణంగా ఓడిపోవడం, వారు ఫొటో పోస్టు చేయడంతో ట్రోల్ కావాల్సి వచ్చింది.

Team India
Team New Zealand
Cricket
Mayank
Ishant Sharma
Twitter

More Telugu News