'మహానటి' దర్శకుడితో ప్రభాస్ మూవీ
- పునర్జన్మల నేపథ్యంలో సాగే 'రాధే శ్యామ్'
- ప్రభాస్ ను ఒప్పించిన నాగ్ అశ్విన్
- త్వరలో రానున్న ప్రకటన
ఈ నేపథ్యంలో ఇద్దరు .. ముగ్గురు దర్శకుల పేర్లు వినిపించాయి. ఆ పేర్ల సంగతి అటుంచితే, తాజాగా నాగ్ అశ్విన్ పేరు తెరపైకి వచ్చింది. 'మహానటి' సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేసిన నాగ్ అశ్విన్, అప్పటి నుంచి ఒక కథపై కసరత్తు చేస్తూ వస్తున్నాడు. ఇటీవల ఆయన ఆ కథను ప్రభాస్ కి వినిపించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయట. తాజాగా స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. అందువలన ఈ సినిమాను ప్రకటించడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును గురించిన వివరాలను ప్రకటించడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చని అంటున్నారు.