Srinu Vaitla: కొరటాల సెట్లో చిరూను కలిసిన శ్రీను వైట్ల?

Koratala Siva Movie
  • వరుస ఫ్లాపులతో శ్రీను వైట్ల 
  • తదుపరి ప్రాజెక్టు కోసం ప్రయత్నాలు 
  • మెగా హీరోలకు హిట్లు ఇవ్వలేకపోయిన శ్రీను వైట్ల
ఒకప్పుడు వరుస విజయాలతో అగ్రదర్శకుడు అనిపించుకున్న శ్రీను వైట్ల, ఆ తరువాత వరుస పరాజయాలతో వెనకబడిపోయారు. దాంతో ఆయనకి అవకాశాలు ఇచ్చే హీరోల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే చిరంజీవిని శ్రీను వైట్ల కలుసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం చిరంజీవి .. కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.

షూటింగ్ జరుగుతున్న లొకేషన్ కి శ్రీను వైట్ల వెళ్లి కలిసినట్టుగా తెలుస్తోంది. తన దగ్గరున్న లైన్ ను చిరూ చెవిన వేయడానికే శ్రీను వైట్ల వెళ్లాడనే టాక్ వినిపిస్తోంది. మరి ఆ లైన్ ను ఆయన చిరూ కోసమే అనుకున్నాడా? లేదంటే మెగా ఫ్యామిలీలో వేరే హీరోతో అనుకున్నాడా? అనేది తెలియాల్సి వుంది. అయితే గతంలో చిరంజీవితో శ్రీను వైట్ల చేసిన 'అందరివాడు'  .. చరణ్ తో చేసిన 'బ్రూస్ లీ' .. వరుణ్ తేజ్ తో చేసిన 'మిస్టర్' భారీ పరాజయాలను చవిచూశాయి. ఈ నేపథ్యంలో చిరూను శ్రీను వైట్ల కలవడం వలన ఎంతమేరకు ప్రయోజనం ఉంటుందన్నది చూడాలి.

Srinu Vaitla
Chiranjeevi
Koratala Siva Movie

More Telugu News