ఆ సినిమా తరువాత లవ్ లెటర్స్ విపరీతంగా వచ్చాయి: 'ఆనందం' హీరోయిన్
- కెరియర్లో మొదటి సినిమా 'చిత్ర'
- తొలి మూడు సినిమాలు 175 రోజులు ఆడాయి
- రక్తంతో లవ్ లెటర్స్ రాశారన్న రేఖ
సినిమాలో నేను కనిపించగానే కొంతమంది అభిమానులు చిల్లర డబ్బులు తెరపైకి చల్లేవారట. ఆ విషయం తెలిసి నాకు చాలా సంతోషం కలిగింది. ఆ సినిమా తరువాత నా క్రేజ్ పెరిగిపోయింది. అభిమానుల నుంచి లవ్ లెటర్స్ ఎక్కువగా వచ్చేవి. ఒక అభిమాని అయితే రక్తంతో లవ్ లెటర్ రాశాడు. నిజం చెప్పాలంటే ఆ లవ్ లెటర్ చూసి నేను చాలా భయపడిపోయాను. ఆ సినిమా సక్సెస్ .. దానితో వచ్చిన గుర్తింపును నేను ఎప్పటికీ మరిచిపోలేను. నా తొలి సినిమానేకాదు, ఆ తరువాత వచ్చిన రెండు సినిమాలు కూడా 175 రోజులు ఆడటం విశేషం" అని చెప్పుకొచ్చింది