రాజ్ ఘాట్ లో నివాళులర్పించిన ట్రంప్​ దంపతులు

Donald Trump family visits RajGhat
  • మహాత్ముడి సమాధిని సందర్శించిన ట్రంప్, మెలానియా
  • ట్రంప్ దంపతులకు గాంధీ  జ్ఞాపిక బహూకరించిన మంత్రి
  • రాజ్ ఘాట్ లో ఓ మొక్కను నాటిన ట్రంప్ దంపతులు 
రాష్ట్రపతి భవన్ లో అధికారిక స్వాగతం అనంతరం అక్కడి నుంచి నేరుగా ట్రంప్ దంపతులు రాజ్ ఘాట్ కు వెళ్లారు. అక్కడ మహాత్ముడి సమాధిని సందర్శించారు. గాంధీజీ సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం, ట్రంప్ దంపతులకు గాంధీ విగ్రహం జ్ఞాపికను కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ అందజేశారు. రాజ్ ఘాట్ సందర్శకుల పుస్తకంలో ట్రంప్, మెలానియాలు తమ సందేశాలను రాశారు. రాజ్ ఘాట్ లో ఓ మొక్కను కూడా ట్రంప్ దంపతులు నాటారు.
Go Back to Shorts
Donald Trump
USA
India
New Delhi
Rajghat

More Telugu News