Nitin: ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం సర్: పవన్ పై నితిన్ వ్యాఖ్యలు

Hero Nitin comments on meeting with Pawan Kalyan
  • హిట్ టాక్ తెచ్చుకున్న 'భీష్మ'
  • పవన్ ను కలిసిన చిత్రబృందం
  • పవన్ తో గడిపిన క్షణాలు అమూల్యమైనవంటూ ట్వీట్ చేసిన నితిన్
ఇటీవల విడుదలైన 'భీష్మ' చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మరికొన్నిరోజుల్లో పెళ్లికొడుకు కాబోతున్న నితిన్ కు ఈ సినిమా ముందస్తు కానుక అని చిత్ర వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్ ను 'భీష్మ' చిత్ర బృందం కలిసింది. హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల, 'సితార ఎంటర్టయిన్ మెంట్స్' నాగవంశీ పవన్ ను కలిసి తమ ఆనందాన్ని ఆయనతో పంచుకున్నారు.

దీనికి సంబంధించిన ఫొటోలను నితిన్ ట్వీట్ చేశారు. 'భీష్మ' చిత్రం ఘనవిజయం సాధించినందుకు చిత్రబృందాన్ని పవర్ స్టార్ అభినందించారని వెల్లడించారు. పవన్ తో గడిపిన ఆ క్షణాలు వెలకట్టలేనివని సంతోషంతో పొంగిపోయారు. 'మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం సర్' అంటూ తన ఆరాధ్య హీరోపై అభిమానాన్ని ప్రదర్శించారు.
Nitin
Pawan Kalyan
Bhishma
Venky Kudumula
Naga Vamsi

More Telugu News