మహారాష్ట్రలో దిశ చట్టం తెచ్చే దిశగా ప్రయత్నాలు
- చట్టంపై అధ్యయనం చేసేందుకు ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు
- వచ్చే నెల 30వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశం
- ఇదివరకే ఆసక్తి వ్యక్తం చేసిన ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు
మార్చి 30వ తేదీలోపు నివేదిక అందజేయాలని ఈ కమిటీని ఆదేశించినట్టు ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తెలిపారు. దిశ చట్టం గురించి తెలుసుకునేందుకు తాము ఏపీలో పర్యటించామని చెప్పారు. ఈ చట్టంపై ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు కూడా ఇంతకుముందు ఆసక్తి వ్యక్తం చేశాయి. ఏపీ సర్కారు నుంచి పూర్తి వివరాలు కోరాయి.