మహారాష్ట్రలో దిశ చట్టం తెచ్చే దిశగా ప్రయత్నాలు
అత్యాచార కేసుల్లో నిందితులకు మరణ శిక్ష పడేలా చేయడంతో పాటు 21 రోజుల్లోనే తీర్పు వెలువడేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది రూపొందించిన ‘దిశ’ చట్టాన్ని మహారాష్ట్రలోనూ తెచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చట్టంపై అధ్యయనం చేసేందుకు మహారాష్ట్ర సర్కారు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.
మార్చి 30వ తేదీలోపు నివేదిక అందజేయాలని ఈ కమిటీని ఆదేశించినట్టు ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తెలిపారు. దిశ చట్టం గురించి తెలుసుకునేందుకు తాము ఏపీలో పర్యటించామని చెప్పారు. ఈ చట్టంపై ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు కూడా ఇంతకుముందు ఆసక్తి వ్యక్తం చేశాయి. ఏపీ సర్కారు నుంచి పూర్తి వివరాలు కోరాయి.