Donald Trump: సబర్మతీ ఆశ్రమంలో మోదీతో కలిసి నేలపై కూర్చున్న ట్రంప్ దంపతులు

trump visits india
  • ఆశ్రమ విశిష్టతను వివరించిన మోదీ
  • ఆశ్రమాన్నంతటినీ చూపెట్టిన ప్రధాని
  • ఆశ్రమం సందర్శకుల పుస్తకంలో ట్రంప్ దంపతుల సంతకం
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ఆశ్రమంలో నేలపై కూర్చున్నారు. కాసేపు ముగ్గురూ కలిసి నేలపై కూర్చొని మాట్లాడుకున్నారు. ఆశ్రమ విశిష్టతను వారికి మోదీ వివరించి చెప్పారు. ఆశ్రమాన్నంతటినీ చూపుతూ వారితో గడిపారు. ఆశ్రమం సందర్శకుల పుస్తకంలో ట్రంప్ దంపతులు సంతకం చేశారు. ఈ గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఆ తర్వాత అందులో మెలానియా కూడా సంతకం చేసి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ప్రధాని మోదీతో పాటు ట్రంప్ దంపతులు మొతెరా స్టేడియానికి బయలుదేరారు.
Donald Trump
India
Namaste Trump
Narendra Modi

More Telugu News