అమోఘం, అద్వితీయం... ట్రంప్ రాకముందే మొతేరా స్టేడియానికి లక్ష మంది!
- ఉదయం 8 గంటల నుంచే స్టేడియంలోకి ప్రజలు
- తనిఖీలు చేసిన తరువాత అనుమతిస్తున్న పోలీసులు
- సుమారు ఒకటిన్నర లక్ష మంది హాజరయ్యే అవకాశం
ఈ ఉదయం 8 గంటల నుంచే స్టేడియంలోకి ప్రజలను అనుమతించడాన్ని ప్రారంభించారు. లోనికి వచ్చే ప్రతి ఒక్కరినీ మూడంచెల తనిఖీ తరువాతనే గ్యాలరీల్లోకి పంపించారు. ఇక మైదానంలో కూర్చునే వారిని ఐదంచెల్లో తనిఖీలు చేశారు. మోదీ, ట్రంప్ ప్రసంగించే డయాస్ చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ లను అమర్చారు. ఇప్పటికే స్టేడియంలో లక్ష మందికి పైగానే ప్రజలు వచ్చి చేరారు. దీంతో ఒక బయటి దేశంలో ట్రంప్ పాల్గొనే కార్యక్రమానికి ఇంత మంది ప్రజలు రావడం ఇదే తొలిసారి కానుంది.