Justice Dharmadhikari Committee: తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజనపై వారం రోజుల్లో సప్లిమెంటరీ నివేదిక

Justice Dharmadhikari committee meets in Delhi
  • ఢిల్లీలో సమావేశమైన జస్టిస్ ధర్మాధికారి కమిటీ
  • ఇదే చివరి సమావేశమన్న జస్టిస్ ధర్మాధికారి
  • గత నివేదికపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఇరు రాష్ట్రాల అధికారులు
  • అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు కమిటీ వెల్లడి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ఉభయ రాష్ట్రాలకు విద్యుత్ ఉద్యోగుల కేటాయింపు ఇంకా పూర్తి కాలేదు. దీనిపై ఏర్పాటైన జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వారం రోజుల్లో సప్లిమెంటరీ నివేదిక ఇస్తామని జస్టిస్ ధర్మాధికారి వెల్లడించారు. విద్యుత్ ఉద్యోగుల విభజనపై ఇదే చివరి సమావేశమని ఆయన స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో గతంలో ధర్మాధికారి కమిటీ ఇచ్చిన నివేదికపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఇరు రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు జస్టిస్ ధర్మాధికారి తెలిపారు.
Justice Dharmadhikari Committee
Andhra Pradesh
Telangana
Electricity
Employees

More Telugu News