ఇప్పుడు ఫ్రాన్స్ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది ఏంటో తెలుసా..?
- ఫ్రాన్స్ లో ప్రబలిన నల్లుల బెడద
- నల్లులపై యుద్ధం ప్రకటించిన ఫ్రాన్స్ సర్కారు
- 100 రోజుల కార్యాచరణ ప్రకటన
- నల్లుల నిర్మూలన కోసం ప్రత్యేక దళం
అప్పట్లో రెండో ప్రపంచయుద్ధం తర్వాత డీడీటీ రసాయనం వినియోగంతో నల్లుల బెడద తొలగిపోయింది. ఆ తర్వాత కాలంలో డీడీటీని నిషేధించడంతో నల్లులకు అడ్డంకి తొలగిపోయింది. ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయి ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. దాంతో నల్లుల నిర్మూలన కోసం 100 రోజుల కార్యాచరణ రూపొందించారు. ఓ టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా కేటాయించారు. పేదవారికి నల్లుల నిర్మూలన మందులు ఉచితంగా అందజేయాలని నిర్ణయించారు. అంతేకాదు, నల్లుల అంతం చూసేందుకు ప్రత్యేక దళాన్ని కూడా ఏర్పాటు చేశారు.